Girl Suspect Death in Jeedimetla : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుభాశ్‌నగర్‌కు చెందిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి ఇంట్లో నుంచి బాలిక అదృశ్యం కావడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె మృతదేహం గుర్తించారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో.. రక్తపు మడుగులో పడి ఉంది.
Girl Suspect Death in Jeedimetla : రాత్రిపూట ఇంట్లో నుంచి అదృశ్యమై.. ఉదయం రక్తపు మడుగులో.. - మేడ్చల్ జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి
Girl Suspect Death in Jeedimetla: ఈనెల 14వ తేదీన రాత్రిపూట ఇంట్లో నుంచి అదృశ్యమైన బాలిక తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లు సుభాశ్నగర్లో చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదుతో గాలిస్తున్న పోలీసులకు ఆమె ఇవాళ ఉదయం రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించింది.
Girl Suspect Death in Jeedimetla
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా.. లేక మరేమైన కారణలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష కోసం.. బాలిక మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.