girl suicide in visakha : రానున్న పుట్టిన రోజుకు ముందుగానే నూతన వస్త్రాలు కొనుగోలు చేయలేదని అలిగి.. 13ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. జీవీఎంసీ 37వ వార్డు పెయిన్ దొర పేటకు చెందిన 13ఏళ్ల బాలిక.. ఓ ప్రైవేటు విద్యాసంస్థలో 8వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి నెలలో రానున్న పుట్టిన రోజుకు బట్టలు కొనివ్వాలని.. ఇంట్లో ఈ నెల 29న మారాం చేసింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులున్నాయని... పుట్టిన రోజు వరకు కొనిపెడతానని బాలిక తండ్రి నచ్చజెప్పాడు. అనంతరం కూతురిని సంతోషపెట్టడానికి శనివారం సాయంత్రం కుటుంబమంతా కలిసి బీచ్‌కు వెళ్లి సరదాగా గడిపారు.
girl suicide in visakha : పుట్టిన రోజుకు బట్టలు కొనివ్వలేదని... బాలిక ఆత్మహత్య - suicide news in visakha district
girl suicide in visakha : ఇటీవల కాలంలో మైనర్ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులపై అలిగి.. చిన్న చిన్న విషయాలకే తనువు చాలిస్తున్నారు. ఇష్టమైన ఫుడ్ ఇప్పించలేదని, ఫోన్ కొనివ్వలేదని, సినిమాకు డబ్బులివ్వలేదని... వంటి కారణాలతో అనేక మంది తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. రానున్న పుట్టిన రోజు బట్టలు కొనివ్వలేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
ఆదివారం ఉదయం 8 గంటలకు ఎప్పటిలాగానే కుటుంబసభ్యులంతా చర్చికి బయలుదేరారు. కుమార్తె పడుకుని ఉండడంతో ఇంట్లోనే వదిలేసి వెళ్లి పోయారు. తిరిగి 10 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. దర్యాప్తు చేపట్టారు. బాలిక తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి