girl suicide: ఫోన్ చూడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య - telangana varthalu
14:37 September 30
girl suicide: ఫోన్ చూడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య
ఎప్పుడూ ఫోన్ పట్టుకుని కూర్చుంటావెందుకని తండ్రి మందలించినందుకు ఓ బాలిక మనస్తాపంతో ఆత్మహత్య(girl suicide) చేసుకుంది. ఈ విషాద ఘటన ఈ నెల 28న హైదరాబాద్లోని న్యూహఫీజ్పేట పరిధిలో గల హనీఫ్ కాలనీలో చోటుచేసుకుంది. హనీఫ్ కాలనీకి చెందిన నందిని(13) నిత్యం ఫోన్ చూస్తుండగా... ఆమె తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెంది నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య(girl suicide) చేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫోన్ చూడొద్దని మందలించినందుకే నందిని ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: Brutal Murder: నాలుగు నెలల పసికందును హత్య చేసిన మేనమామ