STUDENT SUICIDE ATTEMPT : ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. పాఠశాల భవనం పైనుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని బండిఆత్మకూరు కేజీవీబీ( కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం)లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక వారం క్రితం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాలికి తీవ్రగాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనను తొలుత ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే విషయం బయటకు రావడంతో బండారం బయటపడింది.
suiside: ఉపాధ్యాయుడి చేష్టలకు విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగింది? - crime news in ap
TEACHERS HARASSMENTS : పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారితో కాళ్లు, చేతులు ఒత్తించుకుంటున్నారు. ఇదేమిటని ధైర్యం చేసిన అడిగిన విద్యార్థినిపై దూషణలకు దిగారు. దాంతో మనస్థాపం చెందిన ఆ విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం