రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి.. బాలికను గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ఇంటర్ చదువుకొని ఇంటి వద్ద ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెతో స్నేహంగా ఉండేవారు. ఒకరు ప్రేమ పేరుతో శారీరకంగా లోబరుచుకున్నాడు.
ప్రేమ పేరుతో ఒకరు.. స్నేహం మాటున మరొకరు.. బాలికపై అఘాయిత్యం - rangareddy district latest news
ప్రేమ పేరుతో ఒకరు.. స్నేహం మాటున మరొకరు ఆ బాలిక జీవితాన్ని నాశనం చేశారు. మాయమాటలు చెబుతూ.. శారీరకంగా లోబర్చుకున్నారు. పలుమార్లు తమ కామవాంఛను తీర్చుకున్నారు. చివరకు బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
![ప్రేమ పేరుతో ఒకరు.. స్నేహం మాటున మరొకరు.. బాలికపై అఘాయిత్యం ఇద్దరు యువకుల అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15729956-100-15729956-1656907050440.jpg)
ఇద్దరు యువకుల అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక
స్నేహంగా ఉండే మరో యువకుడు మాయమాటలు చెప్పి బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కడుపు నొప్పిగా ఉందని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. గర్భిణీ అని తెలియడంతో నిలదీశారు. స్నేహం, ప్రేమ పేరుతో ఇద్దరు యువకులు లోబరుచుకున్న విషయాన్ని బయటపెట్టింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేశారు.