స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వచ్చిన ఓ యువతిపై మద్యం మత్తులో ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లింది.
స్నేహితుడిని బంధించి యువతిపై సామూహిక అత్యాచారం - అల్లవరం న్యూస్
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తన స్నేహితుడిని బంధించి ముగ్గురు యువకులు .. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన 15 రోజుల క్రితం జరగ్గా.. వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చి.. స్నేహితుడిని బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీశారు. పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. దాంతో బాధితురాలు బంధువులకు చెప్పడంతో వారు బుధవారం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రభాకర్ తెలిపారు.
ఇదీ చదవండి:మంటలు అంటుకుని 50 గుడిసెలు దహనం