పేగు తెంచుకుని మరీ జీవం పోసిన తల్లి.. పిడిగుద్దులతో పేగులదిలేలా చిన్నారిని హింసించింది. ప్రాణం పణంగా పెట్టి జన్మనిచ్చిన ఆ అమ్మ.. బిడ్డ ప్రాణం పోయేలా పాశవికంగా ప్రవర్తించింది. ప్రియుని మోజులో పడి.. కన్న ప్రేమను మరిచి కర్కషంగా(mother murder daughter) చంపేసింది. తన కూతురు తన చేతుల్లో చనిపోయిందన్న పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా.. మృతదేహాన్ని అనాథగా రోడ్డుపై పడేసి చేతులు దులుపుకోవాలనుకుంది. పిసిపిల్లను పొట్టనబెట్టుకున్న పాపం వారిని వదిలిపెట్టకుండా.. కటకటాలపాలు చేసింది. కలకలం రేపిన చిన్నారి హత్య కేసు(baby murder case) మిస్టరీని పోలీసులు ఛేదించారు.
హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన హీనీ బేగం, మహ్మద్ అహ్మద్ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. కూలీ పని, ఇళ్లలో పనిచేసుకుంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అహ్మద్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి.. జైలు పాలయ్యాడు. అనంతరం.. పాతబస్తీ డబీర్‌పురాకు చెందిన షేక్ మహ్మద్ ఖాదర్‌తో హీనా బేగంకు పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పిన ఖాదర్.. పిల్లలతో పాటు హీనాను ముంబాయి తీసుకువెళ్లాడు.
ప్రియుడు తనను రాణిలా చూసుకుంటాడు.. సకల సౌకర్యాలతో సుఖపెడతాడని.. అతడి వెంట వెళ్లిందా..? అంటే.. అక్కడ వారంతా కలిసి బిక్షం ఎత్తుకున్నారు. పిల్లలనూ వదిలిపెట్టకుండా వారితో కూడా బిక్షాటన చేయించారు. హీనా నాలుగేళ్ల చిన్న కూతురు బేబీ హీనాకు ఆడుకోవటం తప్ప అడుక్కోవటం ఏం తెలుసు..? బొమ్మలతో ఆడుకునే ఆ చిన్నారి చేత బలవంతంగా భిక్షాటన చేయిస్తుంటే.. అది ఇష్టం లేని నాలుగేళ్ల మోహక్.. తనను తండ్రి వద్దకు తీసుకువెళ్లాలని మారాం చేసింది.