సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ప్రేమించిన మేనబావతో పెళ్లిని కుటుంబ సభ్యులు రద్దు చేయడంతో బాలిక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన బాలిక(14)తన తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి… ఆమె సోదరితో కలిసి అమ్మమ్మ నివాసం అయిన సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో ఉంటోంది.
ఆ బాలిక సంగారెడ్డి గురుకుల వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా ఆమెను మేనబావ సాయిబాబాకు ఇచ్చి పెళ్లి చేస్తారని ఇంట్లో వాళ్లు అనుకున్నారు. దీంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సాయిబాబా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు అతనితో పెళ్లి రద్దు చేద్దామని అనుకున్నారు.