Rape Attempt on a Woman : తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ యువతిపై.. ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. తిరుపతి నుంచి ఆటోలో ఓ యువతి చంద్రగిరికి బయల్దేరింది. తొండవాడకు చేరుకోగానే.. ఆటోలోని ఇతర ప్రయాణికులు దిగిపోయారు. దీంతో.. యువతి ఒంటరిగా ఆటోలో మిగిలిపోయింది. ఇదే అవకాశంగా భావించి.. ఆటో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆమెను చీకట్లోకి తీసుకెళ్లి దాడి చేసి.. అత్యాచారానికి యత్నించారు.
రాత్రివేళ ఆటోలో ఒంటరిగా యువతి.. ముగ్గురు యువకులు వేరే దారికి తీసుకెళ్లి..
Rape Attempt on a Woman : ఓ యువతిపై.. ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆమెను బలవంతంగా వేరే దారిలోకి తీసుకెళ్లి.. అఘాయిత్యం చేయబోయారు. ఎలాగోలా ఆమె వారి నుంచి తప్పించుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Rape Attempt on a Woman
ఎలాగోలా దుండగుల నుంచి తప్పించుకున్న యువతి.. సమీపంలోని ముక్కోటి శివాలయం వద్దకు చేరుకుంది. ఆలయం వద్ద ఉన్న స్థానికులు ఆ ముగ్గురు దుండగుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆటో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై స్థానిక సీఐ, ఎస్సైకి ఫోన్ చేసి సమాచారమిచ్చినా.. వారు స్పందించలేదని స్థానికులు తెలిపారు. తర్వాత యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని యువతిని తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు.