Girl Died Due to Electric Shock: మొబైల్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఐజ మండలం ఈడిగోనిపల్లిలో బస్వరాజు-జయంతిల కుమార్తె నిహారిక నాలుగో తరగతి చదువుతోంది. ఇంట్లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా.. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామంలోని ట్రాన్స్ ఫార్మార్కు ఉన్న ఎర్త్ సరిగా పని చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు.
సెల్ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా కరెంట్ షాక్.. చిన్నారి మృతి - Jogulamba Gadwala district crime news
Girl Died Due to Electric Shock: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ బాలిక మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అధికారుల నిర్లకక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సెల్ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా కరెంట్ షాక్.. చిన్నారి మృతి
గత 20 రోజుల నుంచి ఇళ్లల్లో స్విచ్చ్‌లు ఆపేసి ఉన్నప్పటికీ.. విద్యుత్ సరఫరా కావడంతో ఫ్యాన్లు, టీవీలు కాలిపోయాయని గ్రామస్థులు ఆరోపించారు. సమస్యపై విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి నిహారిక మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి
ఇవీ చదవండి: