తెలంగాణ

telangana

ETV Bharat / crime

Girl Died with Fever: తీవ్ర జ్వరంతో బాలిక మృతి.. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? - waranagal news

అస్వస్థతకు గురైన బాలికను ఇంటికి పంపించకుండా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహించిందంటూ.. కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఈ విషాద ఘటన వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. బాలిక మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధిత కుంటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు.

girl died with fever
తీవ్రజ్వరంతో బాలిక మృతి

By

Published : Dec 7, 2021, 2:34 PM IST

Girl Died with Fever: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎదుట స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే 7వ తరగతి విద్యార్థిని మృతి చెందిందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.

వర్ధన్నపేట మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో బానోత్ నందిని ఏడో తరగతి చదువుతోంది. 10 రోజుల క్రితం ఆమెకు జ్వరం వచ్చింది. పాఠశాల సిబ్బంది ఆమెను పట్టించుకోకపోగా.. బాలికను ఇంటికి కూడా పంపించలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత బాలికను తమకు అప్పగించారని తల్లిదండ్రులు వాపోయారు.

అంతకు ముందే పాపకు ఎలా ఉందని ఫోన్ చేస్తే.. జ్వరం ఏమీ లేదు అంతా బాగుందని స్కూలు సిబ్బంది చెప్పారు. మా అన్న దగ్గర మాట్లాడిన రికార్డు కూడా ఉంది. డిసెంబర్​ 4వ తేదీన మా పాప కళ్లు తిరిగి పడిపోయిందని స్కూలు నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాము. అప్పటికే పరిస్థితి విషమించింది. పాపకు చాలా రోజుల నుంచి జ్వరం ఉందని.. చాలా ఆలస్యంగా తీసుకువచ్చారని ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. వెంటనే ఆమెను హైదరాబాద్​ తీసుకెళ్లాము. కానీ మా పాప ప్రాణాలు దక్కలేదు. జ్వరం గురించి ముందే మాకు చెప్పి ఉంటే పాపకు ఇలా జరిగేది కాదు. పాఠశాల సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలి. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.

-బాలిక చిన్నాన్న

పరిస్థితి విషమించడం వల్ల చికిత్స కోసం వరంగల్, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినా లాభం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని మృతదేహంతో ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తత తలెత్తగా పోలీసులు చేరుకొని శాంతింపజేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరారు.

తీవ్రజ్వరంతో బాలిక మృతి

ఇదీ చూడండి:గుండెపోటుతో ధాన్యం కుప్పపైనే ప్రాణం విడిచిన రైతు

ABOUT THE AUTHOR

...view details