girl dead body found: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్యంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక శవమై తేలింది. బాలిక తల్లి చెప్పిన వివరాల ప్రకారం...ఉదయం రోజులానే బాలిక టాయిలెట్ కోసం బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఎంతకీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో... చుట్టుపక్కల వెతికారు. చిట్యంపల్లి శివార్లలో బాలిక బట్టలు లేకుండా కనిపించింది. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
టాయిలెట్‌కు వెళ్లిన బాలికపై అత్యాచారం..! ఆపై హత్య - టాయిలెట్‌కు వెళ్లిన బాలికపై అత్యాచారం
girl dead body found: వికారాబాద్ జిల్లా అంగడి చిట్యంపల్లిలో తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక శవమై తేలింది. ఉదయం టాయిలెట్ కోసం బయటకు వెళ్లిన కుమార్తె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో... చుట్టుపక్కల వెతికారు. చిట్యంపల్లి శివార్లలో బాలిక బట్టలు లేకుండా శవమై కనిపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
girl dead body found
బాలిక తలపై స్వల్ప గాయం ఉంది. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. గ్రామంలో నాని అనే యువకుడికి, బాలికకు మధ్య ప్రేమ ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. నానిని విచారించే అవకాశం ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నివేదిక వచ్చాక స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
ఇదీ చూడండి:విద్యార్థులపై దాడి చేసిన దర్జీ.. పోలీసులు ఏం చెప్పారంటే..?
TAGGED:
బాలికపై అత్యాచారం