వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఏకే తండాకు చెందిన మునవత్, కవిత దంపతుల కుమార్తె లాక్డౌన్ వల్ల పాఠశాల లేకపోవడంతో బాలిక ఇంటివద్దనే ఉంటుంది. చదువుకోకుండా నిత్యం టీవీ, సెల్ఫోన్ చూస్తున్న బాలికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది.
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య - వరంగల్ గ్రామీణ వార్తలు
లాక్డౌన్ కారణంతో ఇంట్లోనే ఉంటున్న బాలిక చదువుకోకుండా నిత్యం టీవీ, సెల్ఫోన్ చూస్తున్న ఆమెను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.

తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య
తల్లిదండ్రుల మందలింపుతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:60లో కూడా 6 పలకలతో...