భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విషాదం చోటుచేసుకుంది. చెరువుకట్ట ఏరియాకు చెందిన 9వ తరగతి విద్యార్థిని(14) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో గమనించలేదు.
ఫ్యాన్‌కు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య - girl commits suicide in bhadradri kothagudem district
ఓ విద్యార్థినికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ... ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
ఫ్యాన్‌కు ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
కొంతసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వైద్యుల సమాచారంతో పోలీసులు ఆసుపత్రిలో బాలిక మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.