Girl commits suicide in Nizamabad city: ఈ రోజుల్లో మెుబైల్ ఏ జీవితం అయిపోయింది. కొంత మంది ఫోన్ లేకపోతే ఎంత దారుణం చేయడానికైనా వెనకాడరు. ఇలాంటి సందర్భంల్లో వారి ప్రాణాలు పొగొట్టుకుంటారు లేదంటే వేరే వాళ్లకి సమస్యగా మారతారు. ఈ విధంగానే నిజామాబాద్ జిల్లాలోని ఓ బాలిక తల్లిదండ్రలు సెల్‌ఫోన్ కొనలేదని ఆత్మహత్య చేసుకుంది.
ఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య
Girl commits suicide in Nizamabad city: ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మెుబైల్ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్ కొనడానికి సంకోచిస్తారు. అయితే పిల్లలు అనుకొన్నది ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో ఓ సంఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... నిజామాబాద్ నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ఓ బాలిక హాస్టల్లో ఉండి పదో తరగతి చదువుకునేది. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. చదువుపై అంత మక్కవ లేకపోవడంతో తిరిగి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయింది. చదువుకోమని తల్లిదండ్రులు ఎంత చెప్పిన వినలేదు. ఇటీవలే తనకు ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులను అడిగింది. ఎన్నిసార్లు అడిగిన వారు కొనకపోవడంతో మనస్తా పానికి గురై బాలిక తమ ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకుంది. ఈ సంఘటన 27వ తేది సాయంత్రం జరిగిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: