ఆంధ్రప్రదేశ్‌లోని ఓ యువకుడికి ఫేస్‌బుక్(Facebook friendship) ద్వారా ఏర్పడిన పరిచయం.. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు ప్రాంతాలు.. కృష్ణా జిల్లా మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం పోలీసులను ఉరుకులు పెట్టించింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. జరిగిన సంఘటనను యువకుడు పోలీసులకు(Facebook friendship) వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండేళ్ల కింద పరిచయం
భవానీపురానికి చెందిన యార్లగడ్డ డేవిడ్(Facebook friendship) విజయవాడలోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆ యువతితో రెండేళ్ల కిందట డేవిడ్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సదరు యువతి సోమవారం సాయంత్రం యువకుడి(Facebook friendship)కి ఫోన్ చేసి తాను మైలవరం మండలం పుల్లూరులోని తన మామయ్య వాళ్ల ఇంటి వద్ద ఉన్నానని చెప్పింది. రాత్రికి గుంటూరులో పెళ్లికి వెళ్లాల్సి ఉందని.. తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో డేవిడ్ సరేనన్నాడు.
కారులో తీసుకెళ్తూ
ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో కారులో పుల్లూరు చేరుకున్న అతను.. ఆమెకు ఫోన్ చేసి చిరునామా అడిగాడు. దానికి ఆమె.. తన సోదరుడు వచ్చి తీసుకొస్తాడని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత యువతి సోదరుడు, మరో వ్యక్తి వచ్చి కారులో డేవిడ్(Facebook friendship)ను జమలాపురం మార్గానికి తీసుకెళ్తూ దారిలోనే బ్లేడుతో అతని మెడ, చేతులు కోశారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని అదే కారులో తీసుకుని జి.కొండూరు మండలం కవులూరు, శాంతినగర్ మధ్య మార్గంలోని బుడమేరు కాలువలో పడేశారు. డేవిడ్ ఫోన్, ఉంగరాలు లాక్కొని పరారయ్యారు. కారును జి.కొండూరు, చెవుటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారి బైపాస్‌లో వదిలేశారు.