తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉరి వేసుకొని.. జీహెచ్‌ఎంసీ స్వీపర్ ఆత్మహత్య - భార్యాభర్తల మధ్య మనస్పర్థలు

భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తుకారం గేట్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

GHMC sweeper addicted to alcohol has committed suicide by hanging
ఉరి వేసుకొని.. జీహెచ్‌ఎంసీ స్వీపర్ ఆత్మహత్య

By

Published : Jan 21, 2021, 7:03 AM IST

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తుకారం గేట్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం..

అడ్డగుట్టకు చెందిన మృతుడు కృష్ణ జీహెచ్‌ఎంసీ అవుట్​సోర్స్ విభాగంలో స్వీపర్​గా పని చేసేవాడు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసై.. తరచు భార్యతో గొడవ పడేవాడు. భర్త ప్రవర్తనపై విసిగిపోయిన భార్య.. అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి కృష్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త మరణ వార్త విన్న భార్య.. ఇంటికి చేరుకొని బోరున విలపించింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:భర్తను చంపి అడవిలో పాతిపెట్టింది.. నెల తర్వాత ఏమైందటే..!

ABOUT THE AUTHOR

...view details