తెలంగాణ

telangana

ETV Bharat / crime

Dogs: సంరక్షణ కేంద్రాల్లో దారుణం.. శునకాలకు ప్రాణసంకటం

శునకాలు(Dogs) మనుషులకు మంచి స్నేహితులు. తనను పెంచుకునే వారిపట్ల అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. కాస్త తిండి పెడితే చాలు ఎంతో ప్రేమగా మసులుకుంటాయి. చాలా మంది తమ ఇళ్లలో శునకాలను పెంచుకునేందుకు ఇష్టపడతారు. కొందరైతే వాటిని తమ కుటుంబంలో ఒక్కరిగా చూసుకుంటారు. మరికొందరు తమ పిల్లల్లా ప్రేమగా ఆదరిస్తారు. అంత ప్రేమను పంచే శునకాలతో జీహెచ్​ఎంసీలోని పలువురు అధికారులు రాక్షస క్రీడ ఆడుతున్నారు. నోరులేని మూగజీవాలకు శాస్త్రీయత లేని శస్త్రచికిత్సలు చేస్తూ వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Dogs
Dogs

By

Published : Oct 26, 2021, 10:02 AM IST

జీహెచ్‌ఎంసీలోని పలువురు అధికారులు శునకాల(Dogs)తో రాక్షస క్రీడ ఆడుతున్నారు.సాక్షాత్తు సంరక్షణ కేంద్రాలే.. శవాగారాలుగా మారుతున్నాయి. శాస్త్రీయత లేని శస్త్రచికిత్సలు మూగజీవుల ప్రాణం తీస్తున్నాయి. వీధుల్లో పట్టుకున్న కుక్కలకు రేబిస్‌ నిరోధక టీకా వేసి, భవిష్యత్తులో వాటికి సంతానం కలగకుండా శస్త్రచికిత్స చేసి, నాలుగైదు రోజులపాటు సంరక్షించాల్సిన వైద్యాధికారులు.. వృత్తి ధర్మాన్ని విస్మరించి నిషేధిత సంస్థలతో ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అశాస్త్రీయత.. అమానవీయత..

రోజూ వీధి కుక్కల(street Dogs)ను పట్టుకుని, దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లడం పరిపాటి. నిబంధనల ప్రకారం.. ఏ ప్రాంతంలో పట్టుకున్న కుక్కలను మళ్లీ అదే ప్రాంతంలో వదలాలి. ఈ బాధ్యతను రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్జీవోలకు అప్పగించింది. అందులో రెండింటిపై ఏడబ్ల్యూబీఐ (యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) చాలా రోజుల క్రితమే నిషేధం విధించింది. పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని నగరాల్లో శస్త్రచికిత్సలు సరిగా చేయకపోవడం, కుక్కల మరణానికి కారణమవుతున్నాయన్న కారణాలతో ఏడబ్ల్యూబీఐ వాటిపై వేటు వేసింది. అనంతరం అక్కడి స్థానిక సంస్థ ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) బాధ్యతల నుంచి ఆయా ఎన్జీవోలను తొలగించింది. ఇప్పుడు ఆ 2 సంస్థలకు జీహెచ్‌ఎంసీ ఆశ్రయమిచ్చింది.

దసరా రోజున సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేశామని, వాటిలో చాలా కుక్కలు చనిపోయినట్లు గుర్తించామని ఎర్త్‌ కోశంట్‌ అనే ఎన్జీవో సభ్యురాలు డాక్టర్‌ శశికళ తెలిపారు. వీడియోలు, ఫొటోలు తీసి పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశామన్నారు. మగ కుక్కలకు, ఆడ కుక్కలకు ఏడబ్ల్యూబీఐ నిర్దేశించినట్లు కాకుండా ఇష్టానుసారం అవయవాలను కత్తిరిస్తూ మరణాలకు కారణమవుతున్నట్లు మల్కాజిగిరి, ఎల్లమ్మబండ, అంబర్‌పేట సంరక్షణ కేంద్రాల్లో గుర్తించామని డాక్టర్‌ శశికళ ఆందోళన వ్యక్తం చేశారు. శునకాల సంరక్షణ కేంద్రాల్లో చేసే శస్త్రచికిత్సలు, రేబిస్‌ నిరోధక టీకాల కార్యక్రమాలు సవ్యంగా జరగకపోవడంతోనే కుక్కకాటు సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details