పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్‌లో నైట్రోజన్ గ్యాస్ లీకై ముగ్గురు ఒప్పంద కార్మికులు అనారోగ్యానికి గురయ్యారు. వారిని గోదావరిఖని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి.. చికిత్స చేయిస్తున్నారు. నైట్రోజన్ పైపులను క్లీన్ చేయాలని మెయిన్వాల్ బంద్ చేయకుండానే ఇంజినీరు... కార్మికులను పనులకు పంపించాడు.
గ్యాస్‌లీకై.. ముగ్గురు కార్మికులకు అనారోగ్యం - peddapalli district latest news
రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్‌లో నైట్రోజన్ గ్యాస్ లీకైంది. అది పీల్చుకున్న ముగ్గురు ఒప్పంద కార్మికులు అనారోగ్యానికి గురయ్యారు.
గ్యాస్‌లీకై.. ముగ్గురు కార్మికులకు అనారోగ్యం
అకస్మాత్తుగా నైట్రోజన్ పైపు నుంచి వాయువు లీకైంది. ఆ గాలిని పీల్చిన ముగ్గురు కార్మికులు అనారోగ్యం పాలయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రజా రవాణాపై కరోనా ప్రభావం.. వైరస్‌కు బలవుతున్న ఉద్యోగులు