రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి ఇంజాపుర్లోని తుల్జా భవాని కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగి గుడిసె దగ్ధం అయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
గ్యాస్ లీకై మంటలు.. లక్షల మేర నష్టం - hyderabad news today
గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. అవి కాస్తా ఎగిసిపడి గుడిసె మొత్తం దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేని కారణంగా ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన వనస్థలిపురం పరిధిలోని ఇంజాపుర్లో జరిగింది.
గ్యాస్ లీకై మంటలు.. లక్షల మేర నష్టం
మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో స్థానికులు గమనించి... మంటలను ఆర్పీ గుడిసెలో సిలిండర్ను బయటకి తీసేశారు. ఇంట్లో ఉన్న వివిధ గృహోపకరణాలు పూర్తిగా కాలిపోవడం వల్ల.. సుమారు రెండు లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆ ఇంటి యజమాని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :మద్యం దుకాణంలో అగ్నిప్రమాదం