అసలే చలికాలం. పైగా ఉదయమే కుళాయి నీరు మంచు గడ్డలను తలపించేలా ఉంటుంది. వయసు పైబడిన ఆమె చలిని తట్టుకోలేమని... స్నానం చేసేందుకు వేడినీళ్లు పెట్టుకుందామనుకుంది. కానీ గ్యాస్ ఆన్ చేసిన వెంటనే సిలిండర్ బ్లాస్ట్ జరిగి తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి బోయవాడలో చేసుకుంది.
వేడినీళ్ల కోసం గ్యాస్ ఆన్ చేశారు.. కానీ క్షణాల్లోనే.. - gas blast in jagital
08:58 November 11
వేడినీళ్ల కోసం గ్యాస్ ఆన్ చేశారు.. కానీ క్షణాల్లోనే..
బోయవాడలో ఉంటున్న వృద్ధురాలు వేడినీళ్ల కోసం గ్యాస్ ఆన్ చేయబోయింది. ఈ క్రమంలో సిలిండర్ పేలింది. ప్రమాదంలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనాస్థలంలోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదీ చూడండి:పేలిన గ్యాస్ సిలిండర్- ఏడుగురికి తీవ్ర గాయాలు
అపార్ట్మెంట్లో పేలిన సిలిండర్- 8 మంది మృతి
Gas Cylinder Blast : అనుకోని సంఘటన.. కాలిబూడిదైన రైతు సొంతింటి కల