తెలంగాణ

telangana

ETV Bharat / crime

3 క్వింటాళ్ల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్ - తెలంగాణ వార్తలు

ఖమ్మం జిల్లా బోనకల్ వద్ద గంజాయి తరలిస్తున్న మూడు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. రూ.52లక్షలు విలువ చేసే మత్తు పదార్థాలను రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ganja seized,  ganja seized by khammam police
గంజాయి పట్టివేత, ఖమ్మం జిల్లాలో గంజాయి పట్టివేత

By

Published : Apr 25, 2021, 8:05 AM IST

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ వద్ద గంజాయి తరలిస్తున్న ఆటోలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మూడు ఆటోల్లో సుమారు మూడు క్వింటాళ్ల మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు... తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దీని విలువ రూ.52 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

గంజాయిని తరలిస్తున్న మూడు ఆటోలను సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బోనకల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:వర్ధన్నపేటలో రూ.10లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details