సికింద్రాబాద్ యాప్రల్లోని ఓ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచడం కలకలం రేపింది. గోదావరి గార్డెన్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఏడు పెద్ద కుండీల్లో పెంచుతోన్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి మొక్కల కలకలం.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పెంపకం.. - గోదావరి గార్డెన్
ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని యాప్రల్లో ఉన్న ఓ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. సదరు ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ganza cultivation in house only at secundrabad
గత కొంత కాలంగా గంజాయి మొక్కలను పెంచుతూ.. స్థానికంగా యువతను లక్ష్యంగా చేసుకొని విక్రయాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అల్వాల్ డిప్యూటీ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సమక్షంలో పంచనామా నిర్వహించారు. మొక్కలను సీజ్ చేసి నిందితులను జవహార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: