ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నర్సీపట్నం నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 86 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.17.30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నలుగురు నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వీరిపై గతంలోనూ పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని.. ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు వరంగల్ టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు.
ఏపీ టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్ - వరంగల్ తాజా వార్తలు
వరంగల్ జిల్లాలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖిల్లా వరంగల్ మండలం మామునూర్ వద్ద టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు.
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్