జల్సాలకు అలవాటు పడి హైదరాబాద్ శివారులో గంజాయి విక్రయాలు (Ganjai Smuggling) జరుపుతున్న ఓ లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన సంతోష్‌రాయ్... బతుకుదెరువు కోసం వలసవచ్చి, కుటుంబంతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసముంటున్నాడు. తుర్కయంజాల్‌లో లారీడ్రైవర్‌గా పనిచేసే వాడు.
అక్కడ పనిచేసే క్రమంలో ఓ టీకొట్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో సంతోష్ రాయ్... ఆ వ్యక్తి నుంచి తక్కువ ధరకు గంజాయి కొనేవాడు. అనంతరం యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు (Ganjai Smuggling) జరిపేవాడు. ఇటీవల జరిగిన సైదాబాద్ ఘటన తర్వాత పోలీసులు... గంజాయి అమ్మేవారిపై, సేవించే వారిపై నిఘా పెట్టారు.
ఆ క్రమంలో సంతోష్‌పై కూడా పోలీసులు దృష్టి పెట్టి గంజాయి అమ్ముతుండగా అరెస్ట్ చేశారు. ఒక్కొక్క ప్యాకెట్ రూ. 150కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 75 ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.