తెలంగాణ

telangana

ETV Bharat / crime

అమెరికా నుంచి పార్శిల్​లో పరుపు.. ఓపెన్​ చేస్తే గంజాయి.. ఆ తర్వాత..

Ganja found in mattress: ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా దిగుమతి అవుతున్న గంజాయి.. ఇప్పుడు విదేశాల నుంచి సైతం దిగుమతి అవుతోంది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వివిధ మార్గాల్లో గంజాయి సరఫరాకు పాల్పడుతున్నారు. అమెరికా నుంచి ఓ కొరియర్​ సంస్థకు వచ్చిన పార్శిల్​లో గంజాయిని గుర్తించిన ఎన్సీబీ అధికారులు నిందితులను అరెస్టు చేశారు.

Ganja Seized in courier company
కొరియర్​ కంపెనీలో గంజాయి పట్టివేత

By

Published : Feb 21, 2022, 4:24 PM IST

Ganja found in mattress: అమెరికా నుంచి వచ్చిన ఓ పార్శిల్‌లో హైదరాబాద్‌ ఎన్సీబీ అధికారులు గంజాయి గుర్తించారు. ఆ పార్శిల్​ను దిగుమతి చేసుకున్న ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేశారు. నగరంలోని ఓ కొరియర్ సంస్థకు దిగుమతైన పరుపులో గంజాయి కవర్లను అధికారులు పట్టుకున్నారు. ఇందులో 1.42 కిలోల హైగ్రేడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు గతంలో కూడా పలు రకాల మాదకద్రవ్యాలను.. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. వాటిని వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారని తేల్చారు. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా దందా కొనసాగుతోందన్న అధికారులు.. డార్క్ నెట్ ద్వారా గంజాయిని ఆర్డర్ చేస్తున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details