Ganja smuggling in visakha: గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటుంటే... అక్రమార్కులు మాత్రం రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఏపీలోని విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ, ఉషోదయ కూడలి వద్ద ముందస్తు సమాచారం మేరకు ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బొడ్డు ఆదిత్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా... గంజాయితో తయారు చేసిన 17 కుక్కీలు దొరికాయి. దీంతో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యపోయారు.
Ganja smuggling: కుకీస్లో గంజాయి... ఆశ్చర్యపోయిన ఎక్సైజ్ అధికారులు
Ganja smuggling in visakha : గంజాయిని రవాణా చేసేందుకు అక్రమార్కులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గంజాయిని ఏకంగా బేకరీలో అమ్మే కుకీస్ రూపంలో తయారుచేసి సప్లై చేస్తున్నారు. ఏపీలోని విశాఖలో వెలుగుచూసిన ఈ ఘటన స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులను ఆశ్చర్యపరిచింది.
Ganja smuggling
తాను కుటుంబంతో కలిసి కాశీకి వెళ్లినప్పుడు 22 గంజాయి కుకీలను కొనుగోలు చేసినట్టు ఆదిత్య తెలిపాడు. నిందితుడి నుంచి 17 కుకీలు, ఓ చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:constable rape attempt: బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం