తెలంగాణ

telangana

ETV Bharat / crime

ganja seized in Telangana: గంజాయి రవాణాకు అడ్డాగా జాతీయ రహదారి.. భారీ మొత్తంలో సీజ్!

గంజాయి అక్రమ రవాణాకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. నెల రోజుల్లోనే రూ.కోటి విలువైన సరకు పట్టుబడటం... మత్తు పదార్థం విచ్చలవిడి రవాణాను తెలియజేస్తోంది. ఏపీ-ఒడిశా సరిహద్దు ఏవోబీతోపాటు... విశాఖ, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు నల్గొండ జిల్లా పోలీసులు గుర్తించారు.

Marijuana seized in nalgonda, ganja seized in nalgonda
నల్గొండలో గంజాయి పట్టివేత, నల్గొండలో గంజాయి సీజ్

By

Published : Oct 4, 2021, 11:06 AM IST

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మత్తుపదార్థాలకు(ganja seized in nalgonda district) కేరాఫ్ అడ్రస్​గా మారింది. నెల రోజుల వ్యవధిలోనే రూ.కోటి విలువైన సరకు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. నల్గొండ జిల్లా చిట్యాలలో ఈ నెల 1న పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో... 75 కిలోల గంజాయి పట్టుబడింది(ganja seized in telangana). వేర్వేరు బస్సుల్లో నిర్వహించిన తనిఖీల్లో ఒకచోట 50 కిలోలు, మరో వాహనంలో 25 కిలోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీస్థాయిలో మత్తు పదార్థాలు చిక్కాయి.

ఖరీదైన కార్లలో..

కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, దేవరకొండ... ఇలా ప్రధాన ప్రాంతాల్లో గంజాయి పట్టుబడుతోంది. ఖరీదైన కార్లు వినియోగించే మాఫియా... వాహనం మొత్తం తనిఖీ చేస్తే తప్పా సరుకు కనిపించకుండా విధంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ఏవోబీ... విశాఖ, రంపచోడవరం ఏజెన్సీల నుంచి హైదరాబాద్, ముంబయి చేరవేయడానికి ముఠాలు కొన్నాళ్లుగా యత్నిస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ, అద్దంకి-నార్కట్​పల్లి రహదారుల్లో విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతోంది.

ప్రత్యేక నిఘా

సూర్యాపేట కొత్త బస్టాండు ప్రాంతంలోనే పోలీసులు... పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరిణామాల్ని గమనించిన పోలీసులు... ప్రత్యేక బృందాల్ని మోహరించాయి. జాతీయ రహదారులపై ఈ బృందాలు నిత్యం నిఘా ఏర్పాటు చేశారు. గంజాయి రవాణాలో కొత్త మార్గాలను కేటుగాళ్లు అమలుచేస్తుండటంతో... అనుమానం ఉన్న ఏ వాహనాన్ని పోలీసులు వదలడం లేదు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు... గత కొద్దిరోజులుగా ఈ మత్తుపదార్థం అక్రమ రవాణాపైనే పూర్తిస్థాయిలో దృష్టిసారించినట్లు కనపడుతోంది.

డబ్బు సంపాదన కోసమే..

మిర్యాలగూడ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల యువతీయువకులు... ఈ గంజాయి రవాణాలో పాలుపంచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్కో పర్యాయం రూ.లక్షదాకా సంపాదించుకునే అవకాశం ఉండటంతో... దీనిపైనే యువత దృష్టిసారిస్తున్నట్లు కనపడుతోంది. అటు హైదరాబాద్​లో ఉద్యోగాలు చేసే మరికొంతమంది యువకులూ అదే బాట పడుతున్నారు. ఖరీదైన కార్లలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి... ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి తీసుకువస్తున్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి.

ఇదీ చదవండి:Telugu akademi scam 2021 : 'ఫిబ్రవరిలోనే ఎఫ్​డీలు కాజేసేందుకు యత్నం!'

ABOUT THE AUTHOR

...view details