Ganja Seized in Vizag: ఏపీలోని విశాఖ జిల్లా మాడుగుల మండలం గరికిబంద చెక్ పోస్టు వద్ద 220 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. గరికిబండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. బోలెర్ వాహనంలో తరలిస్తున్న 220 కేజీల గంజాయి పట్టుబడింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాడుగుల ఎస్సై రామారావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు (ganja seized in Visakhapatnam) పేర్కొన్నారు.
మన్యం ప్రాంతంలో వందల ఎకరాల్లో గంజాయి తోటలను నాశనం చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదు. తాజాగా 220 కేజీల గంజాయి (ganja seized in Visakhapatnam) పట్టుబడింది.