తెలంగాణ

telangana

ETV Bharat / crime

గరిడెగామలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు - తెలంగాణ వార్తలు

సంగారెడ్డి జిల్లా గరిడెగామ గ్రామంలో గంజాయి సాగును టాస్క్​ఫోర్స్ పోలీసులు గుర్తించారు. జొన్న పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న మత్తు పదార్థాలకు సంబంధించిన మొక్కలను ధ్వంసం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ganja seized by task force police at garidegama village in sangareddy district
గరిడెగ్రామంలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు

By

Published : Mar 21, 2021, 7:18 PM IST

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని గరిడెగామ గ్రామంలో టాస్క్​ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా నిర్వహించిన దాడుల్లో గంజాయి పంట సాగును గుర్తించారు. గ్రామానికి చెందిన విట్టల్​ జొన్న పొలంలో అంతర పంటగా అక్రమంగా సాగు చేస్తున్న 356 గంజాయి మొక్కలు ధ్వంసం చేశారు.

విట్టల్ గొండ ఇంట్లో నిల్వ ఉంచిన 10 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి:నొప్పి భరించలేక.. విషం తాగాడు

ABOUT THE AUTHOR

...view details