ఖమ్మం జిల్లా వైరాలో అక్రమంగా తరలిస్తున్న తంబాకును పోలీసులు సీజ్ చేశారు. బోలేరో వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. దీని విలువ రూ.17,32,500 ఉంటుందని అంచనా వేశారు.
వైరాలో రూ.17లక్షల విలువైన తంబాకు స్వాధీనం.. ఒకరు అరెస్ట్ - తెలంగాణ వార్తలు
వైరాలో అక్రమంగా తరలిస్తున్న తంబాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.17లక్షలకు పైగా విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఒకరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
వైరాలో గంజాయి పట్టివేత, గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
కర్ణాటకలోని బీదర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు తరలిస్తున్న వాహనాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 165 బాక్సుల్లో ఉన్న తంబాకు ప్యాకెట్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఉరి బిగించాడు.. ఉత్తుత్తినే ఏడ్చాడు!