సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం(Ganja seize at maddirala mandal) ఎర్రపహాడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 26కిలోల గంజాయిని(Ganja smuggling) పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం ఉండటంతో పోలుమల్ల గ్రామశివార్లోని 965 జాతీయ రహదారి పై వాహనాలను తనిఖీ చేసినట్లు ఎస్ఐ నర్సింగ్ వెంకన్న తెలిపారు. దిల్లీకి చెందిన సౌరవ్, అమిత్ అనే ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరంలో రూ.2 లక్షల విలువ గల 13 గంజాయి ప్యాకెట్లను కోనుగోలు చేశారు.
Ganja smuggling: 26కిలోల గంజాయి పట్టివేత.. లారీలో తరలిస్తుండగా సీజ్ - తెలంగాణ వార్తలు
పోలీసులు ఎంత కట్టడి చేసినా...నిత్యం ఏదో ఒకచోట గంజాయి(Ganja smuggling) పట్టబడుతూనే ఉంది. తాజాగా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం(Ganja seize at maddirala mandal) ఎర్రపహాడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 26కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Ganja smuggling
గంజాయిని దిల్లీకి తరలించే ప్రయత్నంలో ఖమ్మం నుంచి మరిపెడ బంగ్లా వరకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి ఎర్రపహాడ్ ఎక్స్ రోడ్డు వరకు లారీలో వస్తుండగా పక్కా సమాచారంతో సోదాలు జరిపిన పోలీసులు... గంజాయిని స్వాధీనం(Ganja seize at suryapet district) చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింగ్ వెంకన్న పేర్కొన్నారు.
ఇదీ చదవండి:గుప్పుమంటున్న గంజాయి- యథేచ్ఛగా సాగు, రవాణా