తెలంగాణ

telangana

ETV Bharat / crime

Mahabubabad Gang War: అర్ధరాత్రి గ్యాంగ్​వార్... కత్తులతో వీరంగం - Mahabubabad News

Mahabubabad Gang War: మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో గ్యాంగ్​ వార్ కలకలం సృష్టించింది. తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఆపే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

Mahabubabad
Mahabubabad

By

Published : May 30, 2022, 4:17 PM IST

Updated : May 30, 2022, 4:27 PM IST

మహబూబాబాద్​లో గ్యాంగ్​వార్... కత్తులతో వీరంగం

Mahabubabad Gang War: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి తగిన మైకంలో ఇద్దరు వ్యక్తులు... మరో వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. పాత కక్షలతో జిల్లా కేంద్రానికి చెందిన జానీ, బయ్యశశి... మల్లేశ్​పై దాడి చేశారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచి, హత్యాయత్నం చేశారు. ఆపే ప్రయత్నం చేసిన మిత్రులకు గాయాలయ్యాయి. వీరిపై మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్​లో ఇదివరకే రౌడీషీట్​ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

కొంతమంది రాజకీయ నాయకుల మద్దతు వీరికి ఉన్నందు వల్లే పట్టణంలో ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి ఘటనలతో తాము భయాందోళనలకు గురవుతున్నట్లు ఆందోళన తెలిపారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్యాంగ్ వార్​కు సంబంధించిన వీడియోలు వాట్సాప్​లో వైరల్​గా మారాయి.

ఇవీ చదవండి:

Last Updated : May 30, 2022, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details