సరదాగా గడిపేందుకు.. సీతానగరం పుష్కర ఘాట్‌కు వెళ్లిన ప్రేమ జంటపై దాడి జరిగింది. బాధితురాలు నర్సింగ్‌లో శిక్షణ పొందుతుండగా.. ఆమెను పెళ్లి చేసుకోబోయే యువకుడు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. వీరు నిన్న రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి.. యువతిపై దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి గుంటూరు జీజీహెచ్‌లో(GGH) చికిత్స అందిస్తున్నారు.
నిన్న రాత్రి పుష్కరఘాట్‌లో తన కుమార్తెపై.. అఘాయిత్యం జరిగినట్లు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు బాధితురాలి తల్లి తెలిపారు. తన కుమార్తెకు ఇటీవలే పెళ్లి నిశ్చయించామని.. ఇలాంటి సమయంలో ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.