తెలంగాణ

telangana

ETV Bharat / crime

13 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై సామూహిక అత్యాచారం.. చెత్తకుండిలో మృతదేహం - దివ్యాంగ బాలుడిపై సామూహిక అత్యాచారం

gang rape: మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దివ్యాంగ బాలుడిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. అనంతరం అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.

gang rape on handicaped boy in pune
gang rape on handicaped boy in pune

By

Published : Mar 27, 2022, 10:24 PM IST

gang rape: మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పీర్లబండ తండాకు చెందిన ఓ దివ్యాంగ బాలుడి(13)పై మహారాష్ట్రలోని పుణెలో సామూహిక అత్యాచారం జరిగింది. ఆపై అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి చెత్తకుండిలో పడేసినట్లు సమాచారం.

పీర్లబండ తండాకు చెందిన దంపతుల రెండో సంతానంగా కరణ్‌(13) జన్మించాడు. పుట్టుకతోనే దివ్యాంగుడని(మూగ) తెలుస్తోంది. బ్రతుకుదెరువు కోసం వీరంతా పుణె వెళ్లి చాలాకాలంగా అక్కడే ఉంటున్నారు. కరోనా కారణంగా ఇటీవల సొంతూరికి వచ్చి మళ్లీ పుణె వెళ్లారు. ఈ క్రమంలో కరణ్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్​పై తీసుకెళ్లారు. మరో ఇద్దరితో కలిసి అతనిపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా తీవ్రంగా కొట్టి హింసించి.. కరణ్​ ప్రాణాలు తీశారు. మృతదేహాన్ని సంచిలో మూటగట్టి చెత్తకుండిలో వేస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించండంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పుణె నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చి తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి:మాట్లాడదామని పిలిచి.. కళ్లలో కారం కొట్టి.. రోకలిబండతో బాది.. భర్తను చంపిన భార్య

ABOUT THE AUTHOR

...view details