RAPE ON MINOR: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జనసేన నాయకులు జీజీహెచ్‌కు చేరుకొని.. ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని.. వరుస ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇవీ చూడండి..: