Gang rape of a married woman: వివాహితపై సామూహిక అత్యాచార ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శివారు గ్రామ నిర్మానుష్య ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. శనివారం ఉదయం జహీరాబాద్-డిడిగి శివారులో మత్తులో ఉండి, అచేతన స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానిక వ్యక్తి జహీరాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 ఏళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
జహీరాబాద్లో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం - వివాహితపై సామూహిక అత్యాచారం
14:21 September 25
జహీరాబాద్లో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం
శుక్రవారం రాత్రి హౌసింగ్ బోర్డ్ ఏరియా నుంచి తీసుకొచ్చి జహీరాబాద్ శివారు ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడి వదిలి వెళ్లినట్లు వారు గుర్తించారు. ఆమె ఆటో ఎక్కడంతో మత్తుమందు ఇచ్చారా? లేక జహీరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చాక మద్యం తాగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తను సికింద్రాబాద్లోని తిరుమలగిరి లాల్ బజార్ ప్రాంతానికి చెందిన మహిళగా విచారణలో తేలింది. వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్తతో దూరంగా ఉంటున్నట్లు సమాచారం. బాధితురాలను జహీరాబాద్ పోలీసులు సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై మాట్లాడేందుకు జహీరాబాద్ డీఎస్పీ రఘు నిరాకరించారు.
ఇవీ చదవండి: