Gang Arrested In Cheating People: గుప్త నిధులు ఉన్నాయని అమాయక ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.ఇందుకు సంబంధించిన వివరాలను గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ వెల్లడించారు. కొత్తగూడెంకు చెందిన అప్పాల లక్ష్మణ్ గోదావరిఖనిలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ మిత్రుల సాయంతో జబ్బులు తగ్గిస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
గుప్త నిధుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న.. ముఠా గుట్టు రట్టు - gang arrested in cheating people
Gang Arrested In Cheating People: గుప్త నిధులు ఉన్నాయని అంటూ అమాయక ప్రజలకు బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి లక్షా 50వేల నగదు, ఇత్తడి విగ్రహలు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
Gang Arrested In Cheating People
శరీరంపై కత్తితో కోసి బంగారు తాయత్తులు పెట్టి.. పసుపు రాసినట్టు నమ్మించి లక్షలు వసూలు చేసేవారని అన్నారు. అంతేకాకుండా గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మించి ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.28లక్షలు దండుకున్నట్లుగా తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని.. వారి నుంచి లక్షా 50వేల నగదు, ఇత్తడి విగ్రహలు, 5 చరవాణులు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ గిరిప్రసాద్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: