తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉద్యోగాల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తూ.. చివరకు..

fake certificates gang arrest: సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు ఇస్తామని నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్న ముఠాను హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక ల్యాప్‌టాప్, స్కానర్, లక్ష రూపాయల నగదు, నాలుగు నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

fake certificates gang arrest
నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న ముఠా అరెస్టు

By

Published : Mar 2, 2022, 1:27 PM IST

fake certificates gang arrest: నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు ఇస్తామని నకిలీ ధ్రువపత్రాలు అందిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఆసిఫ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు.

ఉద్యోగం ఇప్పిస్తానని..

ఫిబ్రవరి 25వ తేదీ నాడు దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆసిఫ్ నగర్ పోలీసుల వద్దకు వచ్చి శ్రీ హర్ష అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద నుంచి లక్షా 60 వేల రూపాయల నగదు తీసుకున్నాడు. మొహం చాటేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్, స్కానర్, లక్ష రూపాయల నగదు, నాలుగు నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ప్రాణాలను హరిస్తోన్న భూ వివాదాలు.. పెరుగుతున్న నేరాల తీవ్రత

ABOUT THE AUTHOR

...view details