తెలంగాణ

telangana

ETV Bharat / crime

జూదం ఆడుతున్న 13 మంది అరెస్ట్ - జూదం ఆడుతున్న వ్యక్తుల అరెస్ట్

హైదరాబాద్​లో జూదం ఆడుతున్న 13 మందిని పోలీసుు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.47 వేల నగదు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

Gamblers arrest in Hyderabad
Gamblers arrest in Hyderabad

By

Published : Jun 10, 2021, 10:29 AM IST

ఓ ఇంట్లో గుట్టుగా జూదం ఆడుతుండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.47 వేల స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లోని కుల్సుంపుర ప్రాంతంలోని జియాగూడలో ఇంట్లో కొందరు జూదం ఆడుతుండగా పట్టుకున్నారు.

పోలీసులు దాడి చేసిన సమయంలో ఇంట్లో 13 మంది జూదం ఆడుతున్నట్టు తేలింది. వారి నుంచి నగదుతో పాటు 13 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి.. kharif cultivation: ఖరీఫ్‌ సాగు లక్ష్యం 1.40 కోట్ల ఎకరాలు

ABOUT THE AUTHOR

...view details