యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నమాత్‌పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎల్లంల బాలమ్మ గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కరోనా లక్షణాలు ఉండటం వల్ల స్థానిక ఏఎన్ఎం సాయంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొవిడ్ నిర్ధరణ పరీక్షలు జరపగా పాజిటివ్ అని తేలింది. ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కణ్నుంచి ఉస్మానియాకు పంపించారు.
కరోనా సోకి వృద్ధురాలి మృతి.. ప్రొక్లైనర్ సాయంతో అంత్యక్రియలు - yadadri bhuvanagiri district corona deaths
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ వృద్ధురాలికి ప్రొక్లైనర్ సాయంతో అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా నమాత్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది సమక్షంలో వృద్ధురాలి బంధువులు పీపీఈ కిట్లు ధరించి దహనసంస్కారాలు జరిపారు.
భువనగిరి వార్తలు, కరోనా మృతురాలి అంత్యక్రియలు
వృద్ధురాలికి సరిగ్గా చికిత్స చేయడం లేదని కుమారుడు, భర్త ఆమెను మూడ్రోజుల క్రితం గ్రామానికి తీసుకువెళ్లారు. గురువారం రాత్రి బాలమ్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని, బంధువులకు పీపీఈ కిట్లు అందజేసి బాలమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. గత పది రోజులుగా బాలమ్మతో సన్నిహితంగా ఉన్నవారిని హోంక్వారంటైన్‌కు తరలించారు.
- ఇదీ చదవండి :కోరుట్లలో కొవిడ్‌తో ఆరు నెలల గర్భిణీ మృతి