తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మిత్రులు - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా మద్దిపాలెంలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై అతడి మిత్రులు పెట్రోలు పోసి నిప్పంటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

prakasham district NEWS
man set fire

By

Published : May 3, 2021, 1:04 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై అతడి మిత్రులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. నెలటూరు గ్రామానికి చెందిన అంకమ్మ రావు, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారంపై మిత్రులతో ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో స్నేహితుడిపై సహచరులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.

వెంటనే అంకమ్మ రావు పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్లగా స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపు చేశారు. అప్పటికే అతని శరీరం 80 శాతానికిపైగా కాలిపోవటంతో వెంటనే రిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం- 26మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details