సరదా కోసం నలుగురు స్నేహితులు (Friends Fun game) కలిసి చేసిన గేమ్ పోలీస్ స్టేషన్లో కేసుకు దారితీసిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ (balapur police station) పరిధి షాహీన్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాలాపూర్ బిస్మిల్లాహ్ కాలనీకు చెందిన ఎండీ ఇమ్రాన్, జిలానీ, సమీర్, ఇమ్రాన్ బిన్ అహ్మద్‌లు కలిసి… రెండు బైక్‌లపై ఓ లాఠీని చేతులతో పట్టుకుని లాక్‌డాన్ నిబంధనలు అతిక్రమిస్తూ షాహీన్‌నగర్ ప్రాంతంలో రాత్రి పూట వీధుల్లో తిరిగారు. వారిని చూసి ప్రజలు భయపడతారో లేదా అని తెలుసుకోవడానికి ఇలా చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో(cc camera video) రికార్డయ్యాయి. సమాచారం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు నిందితులను గురువారం అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఓ లాఠీ, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సరదాగా తిరిగారని, ఎవరినీ బెదిరింపులకు గురి చేయలేదని, అలాంటి ఫిర్యాదులు కూడా రాలేదని, వారిపై గతంలో కూడా ఎలాంటి నేర చరిత్ర లేదని సీఐ బి.భాస్కర్ వివరాలు వెల్లడించారు.
Friends Fun game: సరదాగా చేసిన ఆట.. పోలీస్ స్టేషన్‌కు బాట - రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్
అర్ధరాత్రి నలుగురు మిత్రులు(Friends Fun game) సరదా కోసం చేసిన ఆట.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యేవరకు వెళ్లింది. ఆ నలుగురు రైండు బైక్‌లపై ఓ లాఠీ చేతులో పట్టుకుని వాహనాలపై వీధుల్లో తిరిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వివరాలు ఆరా తీశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ (balapur police station) పరిధిలో జరిగింది.
![Friends Fun game: సరదాగా చేసిన ఆట.. పోలీస్ స్టేషన్‌కు బాట Fun game Trail to the police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:00:32:1622122232-tg-hyd-71-27-lathi-gang-arrest-av-ts10003-27052021184930-2705f-1622121570-185.jpg)
సరదాగా చేసిన ఆట.. పోలీస్ స్టేషన్‌కు బాట