friend attack on young man at birthday : పుట్టిన రోజు వేడుకల్లో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం... ఓ యువకుడిపై దాడికి దారి తీసింది. స్నేహితుల మధ్య ఘర్షణ జరిగి... సాయిరెడ్డి అనే యువకుడిని స్నేహితుడు బీరు సీసాతో కొట్టగా... తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఏం జరిగింది?
ఎలమ్మబండలో నివసించే శివ తన జన్మదిన వేడుకలను అంబీర్ చెరువు కట్ట కింద గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి నిర్వహించాడు. ఈ వేడుకల్లో మద్యం సేవించారు. స్నేహితుల మధ్య మాటామాటా పెరిగింది. సాయి రెడ్డి అనే యువకుడిపై హర్ష అనే వ్యక్తి దాడి చేశారని పోలీసులు తెలిపారు. బీరు బాటిళ్లతో సాయి రెడ్డి తలపై బలంగా కొట్టడం వల్ల అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.