షేర్ మార్కెట్ పేరుతో అమాయక ప్రజలు మోసపోయిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో జరిగింది. 3ఏళ్ల క్రితం మహబూబ్సుభాని అనే వ్యక్తి వ్యాపారం నిమిత్తం పట్టణానికి వచ్చాడు. వడ్డీ వ్యాపారం మొదలెట్టాడు. షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని స్థానికులను నమ్మించాడు.
షేర్ మార్కెట్ పేరుతో మోసం.. రూ.50కోట్లతో శఠగోపం
షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు చూపిస్తానని అమాయక ప్రజలను నమ్మించాడు. సుమారు రూ. 50 కోట్ల వరకు వసూలు చేశాడు. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్లో చోటుచేసుకుంది.
షేర్ మార్కెట్ పేరుతో మోసం.. లబోదిబోమంటున్న బాధితులు
అధిక వడ్డీల ఆశతో అమాయక ప్రజలు సుమారు రూ. 50 కోట్ల వరకు మహబూబ్సుభాని వద్ద ఇన్వెస్ట్ చేశారు. వాటిని పట్టుకుని రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా అతడు ఉడాయించాడు. సమాచారం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులను మచ్చిక చేసుకుని మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:బస్టాండ్లో అగ్నిప్రమాదం- ఏడు బస్సులు దగ్ధం
Last Updated : Mar 25, 2021, 10:47 AM IST