ఏపీ, అనంతపురం జిల్లా వెలమద్దికి చెందిన రాచపల్లి శ్రీనివాస్.. సులభంగా డబ్బు సంపాందించాలనే లక్ష్యంతో ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకోసం ఉన్నతాధికారిలా వేషాలు వేసేవాడు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచేసేవాడు. అలా మోసాలకు పాల్పడి 70 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ గజ మోసగాడు.. ఇప్పుడు పోలీసులకు చిక్కాడు.
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన సత్యంద్ర అనే రైతుకు చెందిన ఎద్దులు.. గతంలో విష ప్రభావంతో మృతి చెందాయి. విషయం తెలిసిన నిందితుడు శ్రీనివాస్.. తాను విజిలెన్స్ డీఎస్పీని అంటూ ఫోన్లో రైతుతో పరిచయం చేసుకున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మృతి చెందిన ఎద్దులకు రూ. 45 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. రైతు నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత రైతుకు అనుమానం వచ్చి.. సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.