రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్‌షాకోట్ రహదారిపై కారు బీభత్సం(Road accident news today) సృష్టించింది. ప్రమాదవశాత్తు ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సన్‌సిటీ నుంచి మెహదీపట్నం వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది(Road accident news today).
Road accident news today: కారు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు - తెలంగాణ వార్తలు
రాజేంద్రనగర్‌లో ఓ కారు బీభత్సం(Road accident news today) సృష్టించింది. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కారు ప్రమాదం, రోడ్డు ప్రమాదం
స్థానికుల సమాచారంతో నార్సింగీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్‌పురాకు చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహైల్, పైసల్‌గా గుర్తించారు. పొగమంచు వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి స్నేహితుడు జైద్ ఖాన్‌ను సన్‌సిటీ వద్ద వదలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఇదీ చదవండి:MINOR GIRL RAPE: మానసిక స్థితి సరిగాలేని బాలికపై.. అత్త కొడుకు అత్యాచారం!