తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drowned in river: పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు - కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరిలో విషాదం

ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుష్పగిరి క్షేత్రం వద్ద పెన్నానదిలో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు.

పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు
పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతు

By

Published : Jun 24, 2021, 9:19 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రం వద్ద పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు నది ప్రవాహం ధాటికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు.

అందులో మూడూ మృతదేహాలను వెలికితీయగా.. మరొకరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతైన యువకులు కడపలోని బెల్లంమండి వీధి వాసులుగా గుర్తించారు.

ఇదీ చదవండి: RAPE CASE: తాడేపల్లి అత్యాచారం ఘటనలో కొనసాగుతున్న నిందితుల వేట

ABOUT THE AUTHOR

...view details