తెలంగాణ

telangana

ETV Bharat / crime

Knife attack at Begumpet: తెల్లవారుజామున కత్తిపోట్ల కలకలం.. ఎందుకో తెలుసా..? - తెలంగాణ నేర వార్తలు

Knife attack at Begumpet: హైదరాబాద్​లో తెల్లవారుజామున కత్తిపోట్లు కలకలం రేపాయి. డబ్బులు ఇవ్వలేదని నలుగురు యువకులు వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. బేగంపేట ఇలాహీ మసీదు వద్ద ఈ ఘటన జరిగింది.

Knife attack at Begumpet, hyderabad stabbing case
తెల్లవారుజామన కత్తిపోట్ల కలకలం

By

Published : Jan 23, 2022, 10:10 AM IST

Knife attack at Begumpet : హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. రసూల్​పురాలోని ఇలాహీ మసీదు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ప్రదీప్ అనే వ్యక్తిపై మునీర్, అతని స్నేహితులు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

డబ్బులు ఇవ్వలేదని...

ప్రదీప్ అనే వ్యక్తి తెల్లవారుజామన నాలుగు గంటలకు ఇంటికి వెళ్తుండగా... మసీదు వద్ద ఉన్న మునీర్, అతని స్నేహితులు ఆపి డబ్బులు అడిగినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఆగ్రహంతో వారంతా కలిసి దాడి చేశారని వెల్లడించారు. కత్తితో పొడిచారని వివరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... అంబులెన్స్ ద్వారా ప్రదీప్​ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. ప్రదీప్, మునీర్ ఇద్దరు పాత స్నేహితులేనని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:LOVER CHEATING: ప్రేమ పేరుతో నయవంచన.. పోలీసులను ఆశ్రయించిన యువతి

ABOUT THE AUTHOR

...view details