స్నేహితుని పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు బీచ్ వద్దకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పుక్కల్లపాలెం బీచ్ వద్ద జరిగింది. ప్రమాదంలో నలుగురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు.
Flash: బీచ్‌లో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం - ap news
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కమిటి మండలం పుక్కల్లపాలెం బీచ్‌లో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇప్పటికి ముగ్గురి మృతదేహాలు లభ్యంకాగా... మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతులంతా బొర్రపుట్టుగ వాసులుగా పోలీసులు గుర్తించారు.
four-young-mans-missing
ఇప్పటికి ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా..మరొకరి కోసం గాలింపు చేపట్టారు. మృతులు బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన సాయిలోకేశ్ (20), తిరుమల (17), మనోజ్‌కుమార్ (21)గా గుర్తించారు. మరో యువకుడు గోపీచంద్ (18) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యువకుల మృతితో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:Murder: ఓఆర్ఆర్పై దారుణం.. సైడ్ ఇవ్వలేదని కొట్టి చంపారు..